Wednesday, May 1, 2024

డోర్ డెలివరీ వాహనాల రంగుల మార్పుపై హైకోర్టు స్టే…

హైదరాబాద్ : ఏపీలో రేషన్ డోర్ డెలివరీ వాహనాల రంగుల మార్చాలనే ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌పై హైకోర్టు స్టే ఇచ్చింది.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల‌పై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ వేసిన ఈ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే విధించింది. రేషన్ వాహనాల రంగుల అంశంపై మార్చి 15న తదుపరి విచారణ జరుపుతామని చెప్పింది. కాగా, రేషన్ వాహనాలపై వైసీపీ రంగులు ఉన్నాయని ఎస్‌ఈసీ ఇటీవల అభిప్రాయపడిన విషయం తెలిసిందే. పార్టీలకు సంబంధం లేకుండా ఉండే రంగులు వేయాలని ఇటీవల ఎస్ఈసీ సంబంధిత అధికారులకు సూచించింది. అయితే రంగులు మార్చేందుకు రెండు నెల‌లకు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఖ‌ర్చు కూడా అధికంగా అవుతుంద‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ కోర్టుకి విన్న‌వించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement