Tuesday, April 30, 2024

Haryana – సహజీవనం అంటే పచ్చి వ్యభిచారమే – హై కోర్టు సంచలన తీర్పు

చండీగఢ్ – తాము సహజీవనం చేస్తున్నామని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోర్టుకెక్కిన ఓ జంటకు పంజాబ్-హర్యానా హైకోర్టు నుంచి దిమ్మదిరిగే స్పందన ఎదురైంది

తాము సహజీవనం చేస్తున్నామని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోర్టుకెక్కిన ఓ జంటకు పంజాబ్-హర్యానా హైకోర్టు నుంచి దిమ్మదిరిగే స్పందన ఎదురైంది. పంజాబ్ కు చెందిన ఓ పురుషుడు, మహిళ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. అతడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య నుంచి విడిగా ఉంటున్నాడు. అతడితో కలిసున్న మహిళకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే, కలిసి జీవిస్తున్న వారిద్దరూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. మహిళ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, జస్టిస్ కుల్దీప్ తివారీ ఏకసభ్య ధర్మాసనం నుంచి ఊహించని వ్యాఖ్యలు ఎదురయ్యాయి.

ఈ కేసులో పురుషుడు ఇంకా భార్య నుంచి విడాకులు తీసుకోలేదు. విడాకులు తీసుకోకుండా మరో మహిళతో కలిసి ఉంటే దాన్ని సహజీవనం అనరు. మరో మహిళతో కామంతో కూడిన వ్యభిచారం చేస్తున్నాడు అంటారు. సెక్షన్ 494/495 కింది ఇది నేరం. దీనికి శిక్ష కూడా ఉంటుంది. వ్యభిచారం కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడానికి సహజీవనం అంటూ ఈ పిటిషన్ వేసినట్టుంది” అంటూ జస్టిస్ కుల్దీప్ తివారీ మొట్టికాయలు వేశారు. అంతేకాదు, ఇలాంటి వ్యవహారాల్లో తాము రక్షణ కల్పించలేమని చెబుతూ వారి పిటిషన్ ను తోసిపుచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement