Friday, May 3, 2024

BJP – అమిత్ షా పర్యటన ఓక రోజు వాయిదా… కొత్త షెడ్యూల్ ఇదే…

హైదరాబాద్ -: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు జరిగాయి. వాస్తవానికి ఆయన ఈనెల 17వ తేదీన రావాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్ మారడంతో 18వ తేదీన రానున్నారు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభలతో పాటు రోడ్డు షోలో అమిత్ షా పాల్గొననున్నారు. 18న ఉదయం 10 గంటలకు గద్వాలలో నిర్వహించే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లగొండ సభల్లో, అనంతరం 2 గంటలకు వరంగల్ తూర్పు ప్రచార సభలో ఆయన పాల్గొంటారు

అనంతరం సాయంత్రం 4 గంటలకు జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్డు షోలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement