Monday, April 29, 2024

హార్థిక్‌ పాండ్యాకు టీమ్‌ ఇండియా కెప్టెన్సీ?

టీ 20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో జట్టులో మార్పులు చేయాలంటూ వాదనలు వినిపించాయి. ముఖ్యంగా ఈ పొట్టి ఫార్మెట్‌ కెప్టెన్సీలో మార్పులు చేయాలని చాలామంది అభిప్రాయపడ్డారు. దీంతో మూడు ఫార్మట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మను టీ 20ల నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్థిక్‌ పాండ్యాకు అప్పగిస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే తాజాగా ఇది మరోసారి తెరపైకి వచ్చింది. వైట్‌ బాల్‌ ఫార్మట్‌లో భారత్‌ తరువాతి కెప్టెన్‌గా పాండ్యా బాధ్యతలు అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వన్డే, టీ 20 ఫార్మట్‌తో కూడ చర్చించాం. అయితే దీనిపై స్పందించేందుకు తనకు కొంత సమయం కావాలని అతడు కోరాడు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆలోచనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి” అని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా బుధవారం బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. అయితే ఈ భేటీలో టీ 20/వన్డే కెప్టెన్సీ గురించి ఎలాంటి చర్చ జరగలేదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ”అపెక్స్‌ కౌన్సిల్‌ ఎజెండాలో ఈ అంశం లేదు.

- Advertisement -

దీనిపై చర్చ కూడా జరగలేదు. కెప్టెన్సీపై కేవలం సెలక్షన్‌ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది” అని ఆ అధికారి వెల్లడించారు. ఇకపోతే ఐపిఎల్‌లోనూ గుజరాత్‌ జట్టును అరంగేట్రంలోనే గెలిపించిన పాండ్యాకు పొట్టి ఫార్మట్‌ సారథ్య బాధ్యతలు అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని గత కొంత కాలంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే వన్డే ఫార్మట్‌ పగ్గాలు అప్పగించాలంటే మాత్రం హార్థిక్‌ ఫిట్‌నెస్‌ను మరింత పరిశీలించాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

హార్థిక్‌ కెెప్టెన్సీలోనే..

ప్రస్తుతం రోహిత్‌శర్మ బొటన వేలి గాయంతో బంగ్లా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి అతడు ఇంకా కోలుకోకపోవడంతో వచ్చే నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ 20 సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలను హార్థిక్‌ అప్పగిస్తారని తెలుస్తోంది. ముంబై వేదికగా జనవరి 3, 2023 తొలి టీ 20 మ్యాచ్‌ జరగనుంది. జనవరి 5న పుణలో రెండో మ్యాచ్‌, 7న రాజ్‌ కోట్‌లో మూడో మ్యాచ్‌ ఆడనున్నారు. కానీ కెప్టెన్సీ వార్తలపై అధికారిక ప్రకటన ఏమీ లేదు. మరోవైపు టీ 20ల నుంచి రోహిత్‌కు కొంత కాలం విరామం ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement