Sunday, May 5, 2024

Mexicoలో మ‌రోసారి పేలిన తుపాకులు… ఆరుగురు మృతి

మెక్సికోలో మ‌రోసారి తుపాకులు పేలాయి. సియుడాడ్ ఓబ్రెగాన్‌లో జ‌రుగుతున్న ఓ పార్టీలోకి ముగ్గురు దుండుగులు కాల్పులు జ‌రిపారు. కాల్పుల్లో ఆరుగురు మృతిచెంద‌గా, 26మంది గాయ‌ప‌డ్డారు.

ఈ ఘటనలో నలుగురు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. పార్టీ ప్రారంభమైన కొద్దిసేపటికే ముగ్గురు ఆంగతకులు అక్కడికి వెళ్లారని, అప్పటికే మరొకరు పార్టీలోనే ఉన్నారని తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, మరో 13 మంది చికిత్స అనంతరం దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారని వెల్లడించారు. కాగా మృతుల్లో ఇద్దరు 18 ఏండ్లలోపు వారు ఉన్నారని పోలీసులు చెప్పారు. పోలీసులు కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగా, మరో ముగ్గురు పరారయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement