Saturday, May 4, 2024

Gun Firing – మెక్సికోలో న‌ర‌మేథం – కాల్పుల‌లో 13 మంది కాప్ప్ హ‌తం ..

మెక్సికో : మెక్సికోలో సోమవారం దారుణం జరిగింది. పోలీసు కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. పోలీసులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో 13 మంది పోలీసులు దుర్మరణం చెందారు. ఈ కాల్పుల ఘటన మెక్సికోలోని గురెరో రాష్ట్రంలోని కోయుక డి బెనిటెజ్ నగరంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. జాతీయ భద్రతా విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement