Sunday, April 28, 2024

వాషింగ్ట‌న్ డిసిలో పేలిన తుపాకీ… ముగ్గురు మృతి

అమెరికాలో తుపాకి మోత మళ్లీ మోగింది. రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన మాస్ షూటింగ్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. ఆగ్నేయ వాషింగ్టన్‌లోని అనకోస్టియా ప్రాంతంలో జరిగిందీ ఘటన. షూటింగ్ జరిగిన వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని షూట‌ర్ ను అరెస్ట్ చేశారు..

ఈ ప్రాంతంలోనే గ‌త నెల‌లోనే ఏకంగా 12 సార్లు షూటౌట్లు జ‌రిగాయి.. 9 మంది మ‌ర‌ణించారు.. దీంతో పోలీసులు తుపాకులు ఉన్న వారి కోసం త‌నిఖీలు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement