Monday, May 20, 2024

GT vs CSK | కీలక మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ ఘన విజయం..

అహ్మదాబాద్ వేదికగి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ జట్టు ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో సీఎస్‌కేను చిత్తుగా ఓడించి ప్లేఆప్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 231 పరుగుల బాదిన గుజరాత్… చెన్నై జట్టును 196 పరుగులకే పరిమితం చేసి 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారీ ఛేదనలో 10 ప‌రుగుల‌కే మూడు వికెట్లు ప‌డిన చెన్నైని మిచెల్, మోయిన్ అలీ లు భారీ షాట్లు ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆల్‌రౌండ‌ర్లు డారిల్ మిచెల్ (34 బంతుల్లో 63), మొయిన్ అలీ (36 బంతుల్లో 56)లు ఆర్థ సెంచరీలతో చెలరేగారు. ఇక శివమ్ దూబే (21) రవీంద్ర జడేజా (18) పరుగులకే వెనుదిరిగారు. ఆఖర్లో వచ్చిన ధోని (26) మెరుపులు మెరిపించాడు.

ఇక గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా… సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న గుజరాత్.. 8వ స్థానానికి చేరి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement