Wednesday, May 1, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విసిరిన ఛాలెంజ్ ను ప్ర‌ముఖ సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ స్వీకరించి జూబ్లీహిల్స్ జీహెచ్ ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాలిక్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం గొప్ప నిర్ణయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సింగర్ చిన్మయి, లిరిక్ రైటర్ లక్ష్మీ భూపాల్, మ్యూజిక్ డైరెక్టర్ స్వర సాగర్ మహతి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. కార్యక్రమ అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని కళ్యాణ్ మాలిక్ కి బహుకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement