Monday, April 29, 2024

Finance | అదానీ గ్రూప్‌లో జీక్యూజీ భారీ పెట్టుబడి.. 1 బిలియన్‌ డాలర్ల షేర్ల కొనుగోలు

అదానీ గ్రూప్‌లో అమెరికాకు చెందిన జీక్యూజీ పార్టనర్స్‌ మరోసారి భారీ పెట్టుబడి పెట్టింది. అదానీ గ్రూప్‌లో జీక్యూజీ ఇలా భారీగా పెట్టుబడి పెట్టడం ఇది మూడో సారి. బుధవారం నాడు జీక్యూజీ అదానీ గ్రూప్‌ కంపెనీలకు చెందిన షేర్లను 1 బిలియన్‌ డాలర్లతో, బ్లాక్‌ డీల్‌ ద్వారా ఈ కొనుగోలు జరిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో జీక్యూజీ పార్టనర్స్‌తో పాటు ఐహెచ్‌సీ గ్రూప్‌, ఇతరులు ఈ కొనుగోలు చేశారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన 1.8 కోట్ల షేర్లు, ఇది మొత్తం షేర్లలో 1.6 శాతం, అదానీ గ్రీన్‌లో 3.52 కోట్ల షేర్లు, ఇవి మొత్తం షేర్లలో 2.2 శాతం బ్లాక్‌ డీల్‌లో చేతులు మారినట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. బ్లాక్‌ డీల్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 2,300 రూపాలయకు, అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఒక్కో షేరును 920 రూపాయలకు కొనుగోలు చేశారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఒక్కో షేరు 5.5 శాతం పెరిగి 2,405 రూపాయల వద్ద ట్రేడయ్యింది.

జీక్యూజీ పార్ట్‌నర్స్‌ను భారత సంతతికి చెందిన రాజీవ్‌ జైన్‌ 2016లో స్థాపించారు. ప్రస్తుతం ఆయన కంపెనీ ఛైర్మన్‌, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో జీక్యూజీ 15,446 కోట్లకు సెకండరీ మార్కెట్‌ బ్లాక్‌ డీల్‌ లావాదేవీల ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్‌ ్స, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసింది. రెండో సారి జీక్యూజీ పార్టనర్స్‌ గత నెలలో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో మరోసారి వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా బుధవారం నాడు ఒక బిలియన్‌ డాలర్లు (సుమారు 8,205 కోట్లకుపైగా) పెట్టుబడితో అదానీ గ్రూప్‌లో వాటాలను కొనుగోలు చేశారు.

- Advertisement -

మార్చిలో మొదటిసారి అదానీ గ్రూప్‌లో వాటాలు కొనుగోలు చేసిన సమయంలోనే భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు రాజీవ్‌ జైన్‌ వెల్లడించారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ గ్రూప్‌ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు అనేక చర్యలు తీసుకుంది. ఇటీవల అదానీ గ్రూప్‌లో అమెరికాకు చెందిన సంస్థలు పెట్టబడులు విషయంలో నియంత్రణ సంస్థలు సమాచారం కోరినట్లు వచ్చిన వార్తలతో అదానీ గ్రూప్‌ షేర్లు మరోసారి పతనమయ్యాయి. దీంతో జీక్యూజీ పార్టనర్స్‌కు 4,500 కోట్లు నష్టపోయింది. జీక్యూజీ భారీగా మరోసారి పెట్టుబడి పెట్టడంతో మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement