Sunday, May 5, 2024

ఢిల్లీ పర్యటనలో గవర్నర్ తమిళిసై.. అమిత్ షాతో భేటీ – రాష్ట్ర అంశాలపై నివేదిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం ఆసక్తి రేకిస్తోంది.. ఉదయం 9 గంటలకు ఢిల్లీ చేరుకున్న ఆమె మొదట తెలంగాణ భవన్‌లోని శబరి కాటేజ్‌కు చేరుకున్నారు. 11 గంటలకు నారీశక్తి కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ను కలిశారు. ఆయనకు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నార్త్ బ్లాక్‌లోని కార్యాలయంలో కేంద్రమంత్రి అమిత్ షాతో ఆమె భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గవర్నర్ ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల అమిత్ షా తెలంగాణ పర్యటనకు వెళ్లి రావడంతో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో, మీడియా మొఘల్ రామోజీ రావుతో సమావేశమయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్యే పేరు బయటపడడం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్, ఆయనపై వేటు తదితర అంశాల నేపథ్యంలో హడావుడిగా తమిళిసై ఢిల్లీ పర్యటన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై తమిళిసై అమిత్ షాకు నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ఆమె అమిత్ షాతో ఏం చర్చించి ఉంటారనే అంశం ఆసక్తిగా మారింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి 9 గంటలకు గవర్నర్ హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement