Tuesday, May 7, 2024

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆడవాళ్ళయితే బంగారు ఆభరణాలను ఎంతగానో ఇష్టపడతారు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా మాత్రం తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అయితే తాజా గా బంగారం ధరలు పెరిగిపోయాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 500 పెరిగి రూ. 44,850 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.48,930 కి చేరింది. మరోవైపు వెండి ధర కిలో కి రూ. 1,100 తగ్గి రూ.75,100 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement