Sunday, May 5, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

మగువలకు బంగారం అంటే ఎంత మక్కువో కొత్తగా చెప్పనవసరం లేదు. భారత దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం.. ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. నేటి బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 770 రూపాయలు పెరిగి 48,930 రూపాయలకు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయలు పెరిగి 44,850 రూపాయలకు చేరింది.

మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర 300 రూపాయలకు పెరిగి 73,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement