Thursday, May 2, 2024

బంగారం ధ‌ర‌లు పైపైకి…

బంగారం ధరలు పెరిగాయి. నిన్న తగ్గిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైపైకి కదిలింది. బంగారం ధరలు ఇటీవల కాలంలో ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్ట్ 5న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. దీంతో బంగారం రేటు రూ. 47,500కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. పది గ్రాములకు రూ. 380 మేర పెరిగింది. దీంతో ఈ పుత్తడి రేటు రూ. 51,820కు చేరింది. బంగారం ధరలు నిన్న రూ. 200 వరకు పడిపోయిన విషయం తెలిసిందే. వెండి కూడా జిగేల్ మంది. సిల్వర్ రేటు ఈరోజు పైపైకి చేరింది. రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు నేడు రూ. 63,200కు చేరింది. కాగా సిల్వర్ రేటు నిన్న రూ. 600 వరకు పడిపోయిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా చూస్తే.. వెండి ధర కూడా ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement