Wednesday, May 15, 2024

73శాతం పెరిగిన బంగారం దిగుమతి..

బంగారం దిగుమతులు గతేడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య 73శాతం పెరిగింది. దీని విలువ 45.1బిలియన్‌ డాలర్లు కాగా క్రితం ఏడాది దిగుమతుల విలువ 26.11బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దేశీయంగా గిరాకీ పుంజుకోవడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్యశాఖ తెలిపింది. కానీ ఫిబ్రవరి 2022లో బంగారం దిగుమతి తగ్గింది. ప్రభుత్వ నివేదికల ప్రకారం గత నెలలో బంగారం దిగుమతి 11.45శాతం తగ్గి 4.7బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

పసిడి దిగుమతులు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9నెలల్లో కరెంటు ఖాతాలోటు 176బిలియన్‌ డాలర్లకు చేరింది. రానున్న పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ రెండోస్థానంలో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement