Sunday, April 28, 2024

నీళ్లు తాగ‌డానికి వెళ్లి.. ట్రాప్‌లో చిక్కుకున్న ఏనుగులు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..

అస్పాంలోని అట‌వీ ప్రాంతంలోని ఓ లోతైన‌ నీటి మ‌డుగులో ఏనుగులు చిక్కుకున్న ఘ‌ట‌న జ‌రిగింది. అయితే.. నిన్న అయిదు ఏనుగులు ఆ బురద మ‌డుగులో చిక్కుకుపోగా అట‌వీశాఖ అధికారులు వాటిని సుర‌క్షితంగా కాపాడి అడ‌విలోకి త‌ర‌లించారు. కాగా, ఏనుగుల మంద‌లోని మ‌రో ఆరు ఏనుగులు అదే బుర‌ద‌గుంట‌లో ఈరోజు చిక్కుకుపోయాయి. ఇది గోల్‌ప‌రా జిల్లాలో శుక్ర‌వారం జ‌రిగింది.

ల‌ఖిపూర్ స‌మీపంలోని చోయ్‌బ‌రీ అట‌వీ ప్రాంతంలో ఈ నీటి మ‌డుగు ఉంది. నీళ్లు తాగ‌డానికి వెళ్లిన ఏనుగులు ఆ ట్రాప్‌లో (బుద‌ర మ‌డుగు)లో చిక్కుకుపోయి పైకి రావ‌డానికి నానా తంటాలు ప‌డ్డాయి. వాటి అరుపులు విన్న స్థానికులు అక్క‌డికి వ‌చ్చి వాటి ద‌య‌నీయ స్థితిని చూసి చ‌లించిపోయారు. వెంట‌నే అట‌వీ అధికారుల‌కు స‌మాచారం అంద‌జేశారు.

స‌మాచారం అందుకున్న అటవీశాఖ అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌కవేటర్ల సహాయంతో చెరువుకు ఒకవైపు త‌వ్వ‌కాలు చేప‌ట్టారు. ఏనుగులు ఈజీగా పైకి ఎక్కడానికి వీలు క‌ల్పించారు. స్థానిక గ్రామస్థుల సహకారంతో నీటి మ‌డుగులో చిక్కుకుపోయిన ఆరు ఏనుగులను అటవీశాఖ అధికారులు రక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement