Friday, April 19, 2024

మ‌హేశ్ బాబు ఖాతాలో మ‌రో డీల్ .. మౌంటెన్ డ్యూ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సూప‌ర్ స్టార్ ..

స్టార్ న‌టీన‌టులు ఒక ప‌క్క సినిమాలు , మ‌రోప‌క్క సొంత వ్యాపారాలు..ఇవే కాదు ఇంకో ప‌క్క వాణిజ్య‌ప్ర‌క‌ట‌న‌ల‌తో వారిప‌ని మూడు పువ్వులు , ఆరు కాయ‌లు కాదండోయ్ కాసులుగా ఉంది..కాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఇప్ప‌టికే ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్నారు.. కాగా ఆయ‌న‌కి మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చింది. కూల్ డ్రింక్ అయిన ‘మౌంటెన్ డ్యూ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీ కో ఉత్పాదనల్లో మౌంటెన్ డ్యూ డ్రింక్ కూడా ఒకటి. ఇది పలు దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ డ్రింక్ కి మ‌హేశ్ ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement