Saturday, May 4, 2024

గాడ్ ఫాద‌ర్ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్

గాడ్ ఫాద‌ర్ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం పెట్టారు. అక్టోబర్ 5న దసరా కానుకగా గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయడం మరో విశేషం. సాయంత్రం 5:04 నిమిషాలకు ”నజభజ” అనే సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ అధికారిక రీమేకే గాడ్ ఫాదర్. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రను మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలకమైన క్యామియో అప్పీరెన్స్ ఇవ్వనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement