Thursday, May 2, 2024

గాడ్ ఫాద‌ర్ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్-స్టైలిష్ గా మెగాస్టార్ లుక్

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా న‌టించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మోహ‌న్ రాజా తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రానికి గాడ్ ఫాద‌ర్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రం టీజ‌ర్ ని ఆగ‌స్టు 21న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి న‌టించారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా.. చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ ను ఈ నెల 21 వ తేదీన రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఈ మేరకు చిరంజీవి స్టైలీస్‌ లుక్‌ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.రాజకీయ నేపథ్యంలో జరగబోతున్న ఈ సినిమాలో సల్మాన్ మాఫియా డాన్ గా నటిస్తున్నట్లు టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement