Friday, April 19, 2024

ఘ‌నంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

కరీంనగర్ : కలెక్టరెట్ కార్యాలయంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వ‌హించారు.. పాప‌న్న గౌడ్ చిత్ర పటానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్, సుడా చైర్మన్ జి.వీ,రామకృష్ణారావు, సీపి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్మణ్ రావులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో గౌడ సంఘ నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వ‌హించారు. ఆనాడు సర్వాయి పాపన్న చేసిన పోరాట త్యాగాలను గుర్తు చేస్తూ… ఆయన సేవలను స్మరించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement