Monday, April 29, 2024

గాడ్ ఫాద‌ర్ స్పెష‌ల్ సాంగ్-వెరీ డిఫ‌రెంట్ గా ప్ర‌భుదేవా స్టెప్స్

ఆచార్య పాప్ల్ తో మెగాస్టార్ చిరంజీవి డిజ‌పాయింట్ అయ్యారు. కాగా మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ కి అఫీషియ‌ల్ తెలుగు రీమేక్ గా వ‌స్తోంది గాడ్ ఫాద‌ర్ మూవీ. దర్శకుడు మోహన్ రాజా అప్ డేట్ ఇచ్చేశారు. సోషల్ మీడియా వేదికగా ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ లోని స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ సాంగ్ కు కింగ్ ఆఫ్ డ్యాన్స్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తు్న్నారని, మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టెప్పులేస్తున్నారని తెలిపారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ డెఫినెట్ గా రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి..‘రాజా విక్రమార్క’ చిత్రంతో ప్రభుదేవాను కొరియోగ్రాఫర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరు పలు పాటలు చేశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘గాడ్ ఫాదర్’ కోసం కొలాబరేట్ అయ్యారు. ఈ సాంగ్ లో వెరీ డిఫరెంట్ గా ప్రభుదేవా స్టెప్స్ కంపోజ్ చేశారని తెలుస్తోంది. ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్లూ భాయ్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement