Wednesday, April 24, 2024

అదృష్టం అంటే ఈమెదే-క‌ట్టెల కోసం వెళ్లితే వ‌జ్రం దొరికింది

ఒక్కోసారి ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి ప్ర‌తీ ఒక్క‌రి లైఫ్ లో..జెండా బాయి జీవితంలో ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. జెండా బాయి రోజు అడవిలోనుంచి కట్టెపుల్లలు సేకరించి.. సమీపంలోని గ్రామాల్లో అమ్ముకుని జీవనం సాగిస్తుంటుంది. ఆ రోజు కూడా కర్రపుల్లలు ఏరుకోవడానికి వెళ్లింది. కర్రపుల్లలు ఏరుతుంటే.. ఏదో మెరుస్తూ కనిపించింది. తీరా చూస్తే అది ఒక రాయి. అప్పటికి ఆమెకు దాని గురించి తెలియదు. బాగా మెరుస్తుంది కదా అని తీసుకుంది. పన్నా జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని పురుషోత్తంపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ఆమె రోజువారీ కూలీగా పనిచేస్తూ అడవి నుంచి సేకరించిన కట్టెలను విక్రయిస్తుంది. మెరిసే రాయిని ఆమె భర్తకు చూపించేందుకు ఇంటికి తీసుకెళ్లింది.

అతను అది కేవలం మెరిసే రాయి కాదని అనుమానం వచ్చింది. దీంతో ఆ రాయి తీసుకుని కలెక్టరేట్‌కు వెళ్లాడు. అక్కడ అతను దానిని పరిపాలనా అధికారులకు చూపించాడు. వారు తనిఖీ చేయగా అది 4.39 క్యారెట్ డైమండ్ అని గుర్తించారు. డైమండ్ ఇన్‌స్పెక్టర్ అనుపమ్ సింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి రాయిని డిపాజిట్ చేశారు. తరువాత ఈ రాయిని వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన సొమ్ములో 12.5% ​​ప్రభుత్వ రాయల్టీ, పన్నులను తీసివేసిన తర్వాత ఆ సొమ్ము మొత్తం గెండా బాయికి అందజేయబడుతుంది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆ డబ్బును ఏం చేస్తావని అడగ్గా.. ఇల్లు కట్టి మిగతా మొత్తాన్ని కూతుళ్ల పెళ్లికి పొదుపు చేస్తామని గెండా బాయి చెప్పింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని పెన్నా పరిసర ప్రాంతాలు వజ్రాల గనులకు ప్రసిద్ధి. ఇక్కడ వజ్రాల కోసం తవ్వకాలూ సాగుతుంటాయి. అయితే ఇలా కట్టెపుల్లలు ఏరుకుంటుంటే వజ్రం దొరకడంతో వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement