Tuesday, May 7, 2024

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 50 అడుగులు దాటిన నీటిమట్టం

కొత్తగూడె: భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద అంతకంతకూ నీటిమట్టం పెరుగుతున్నది. ఉదయం 9 గంటల సమయంలో 49 అడుగులు దాటిన వరద ఉధృతి ఇప్పుడు 50.4 అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లోనే 53 అడుగులు దాటే అవకాశం ఉంది. దీంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ఉదయం 7 గంటలకు 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 12,79,307 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. నదిలో వరద ప్రవాహం భారీగా పెరగడంతో స్నానఘట్టాలు మునిగిపోయాయి. నది దిగువన ఉన్న ముంపు మండలాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement