Sunday, April 28, 2024

Meteor:  5రోజుల పాటు ఆకాశంలో అద్భుతం  

5రోజుల పాటు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆకాశం నుంచి భూమిపైకి ఉల్కాపాతాలను దూసుకురానున్నాయి. భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా వీక్షించొచ్చు.

డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు రాత్రి 9గంటల నుంచి తెల్లవారు జామున ఐదు గంటల వరకూ వేరువేరు సమయాల్లో కాంతివంతమైన ఉల్కాపాతాలు కనిపించనున్నాయి. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా ఐదు రోజుల పాటు ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. అదీ కేవలం రాత్రి వేళల్లో మాత్రమే ఈ అద్భుతాన్ని వీక్షించ‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement