Thursday, May 2, 2024

National : ఢిల్లీలో పోలీసుల‌పై గ్యాంగ్‌స్టార్స్ కాల్పులు.. ముగ్గురు అరెస్టు

ఢిల్లీలో అర్థ‌రాత్రి పోలీసుల‌పై గ్యాంగ్ స్టార్స్ కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్‌స్టార్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు మార్చి 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. వారి కదలికలపై పోలీసులకు సోమవారం సమాచారం అందింది. పట్టుకోవడానికి వెళ్లగా.. గ్యాంగ్ స్టార్స్‌ కాల్పులు జ‌రిపారు.

- Advertisement -

ఎదురుకాల్పుల్లో గాయపడిన వారికి ప్రస్తుతం అస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని అంబేడ్కర్ కాలేజీ సమీపంలో రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు పోలీసులకు స్వల్పగా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్యాంగ్​స్టార్స్​ కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుల కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే వారిని పట్టుకొని ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ జాయ్ టిర్కీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement