Saturday, April 27, 2024

కర్ణాటక సరిహద్దుల్లో నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్

పలమనేరు, (రాయలసీమ, ప్రభవెబ్ న్యూస్) : నోట్లు మార్పిడీ పేరుతో రమ్మని పిలిచి పథకం ప్రకారం పోలీసులు వేషాలతో మాయ చేసి దోచుకునే నకిలీ పోలీసుల ముఠా గుట్టు ను వీ కోట పోలీసులు గురువారం రట్టు చేసారు. కర్ణాటక పోలీసులు వేషాలతో దోచుకునే ఐదుగురు సభ్యుల ముఠా ను అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

త్వరలో రెండు వేల రూపాయల నోట్లు రద్దు అయిపోతాయని, తమ దగ్గర ఉన్న నోట్లను వదిలించుకునే క్రమంలో లక్ష రూపాయలిస్తే రూ.లక్షా ఇరవై వేలు ఇస్తామని కొందరు కర్ణాటక రాష్ట్రం శ్రీనివాస పురానికి చెందిన రియాజ్ భాషా అనే వ్యక్తి ని నమ్మించారు. ఆశ పడిన రియాజ్ గత నెల 27న ఆ బృందం చెప్పిన విధంగా రూ. 5 లక్షలు తీసుకుని వీ కోట వద్దకు వచ్చాడు. చెప్పిన విధంగా రియాజ్ కు రూ. 6 లక్షల నోట్లు ఇచ్చిన తరువాత పోలీసులు వేషాలతో కొందరు అక్కడకు వచ్చారు.

రియాజ్ డబ్బులు వదిలేసి పారిపోవడంతో తరువాత వారంతా పంచుకున్నారు. డబ్బులు పోగొట్టుకున్న రియాజ్ కు అనుమానం వచ్చి వీకోట పోలీసులకు పిర్యాదు చేసాడు. ఆ కేసు దర్యాప్తు లో భాగంగా వీ కోట సి ఐ ప్రసాద్ బాబు నే్తృత్వంలో పోలీసులు వేట మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం పట్రపల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కేజీ ఆఫ్ రోడ్డు వైపు నుంచి వీకోట వైపుకు వస్తున్న కొందరు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసారు. వారిని దాసర్లపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో అదుపులో తీసుకోవడంతో మొత్తం వ్యవహారం బయట పడింది.

- Advertisement -

అరెస్టు అయినవారిలో కర్ణాటక కు చెందిన డి.ఎస్.పి సీఐ ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుళ్ల వేషాల్లో ఉన్న అయిదు గురు ఉన్నారని డీ ఎస్ పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో శివన్న, డేనియల్ అనే పాత నేరస్తులు ఉన్నారని చెప్పారు. గతంలో కూడా ఈ తరహా దోపిడీలు చేసినట్టు తెలిందని, వీళ్ళ పై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్ నిమిత్తం తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement