Friday, October 11, 2024

Cricket | డబ్ల్యుటిసి ఫైనల్‌కు ఫీల్డ్‌ అంపైర్లుగా గఫానీ, ఇల్లింగ్‌వర్త్‌

వచ్చేనెల లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరగనున్న ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యుటిసి) ఫైనల్‌కు న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్‌ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా ఎంపికయ్యారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సోమవారం ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 48 ఏళ్ల గఫానీ తన 49వ టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించ నున్నాడు.

అదే సమయంలో 59 ఏళ్ల ఇల్లింగ్‌వర్త్‌కు 64వ టెస్ట్‌ మ్యాచ్‌. యాదృచ్ఛికంగా, ఇల్లింగ్‌వర్త్‌ కూడా రెండేళ్ల క్రితం సౌతాంప్టన్‌లో భారత్‌పై ఎనిమిది వికెట్ల విజయంతో న్యూజిలాండ్‌ గెలిచిన మొదటి డబ్ల్యుటిసి ఫైనల్‌లో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. మరో ఇంగ్లాండ్‌ అంపైర్‌, రిచర్డ్‌ కెటిల్‌బరో టీవీ అంపైర్‌గా నియమితులయ్యారు. శ్రీలంకకు చెందిన కుమార్‌ ధర్మసేన నాలుగో అంపైర్‌గా వ్యవ#హరిస్తారని ఐసీసీ తాజా ప్రకటన తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement