Monday, October 14, 2024

వన్​ ప్లస్​ మొబైల్స్​ నుంచి మరో కొత్త ఫోన్​.. స్పెషల్​ ఎడిషన్​ రిలీజ్​ చేసిన కంపెనీ

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్. ఈ ఏడాది ప్రారంభంలో వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సార్ట్ ఫోన్ దేశంలో మంచి సేల్స్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. దేశంలోని వన్ ప్లస్ వినియోగదారులను ఈ స్మార్ట్ ఫోన్ విపరీతంగా ఆకర్షించింది. వన్ ప్లస్ ఫోన్లలో ఉండే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం కోసం చాలా మంది వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ ఉంటారు.

కాగా, నాలుగు రోజుల క్రితం వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ ని భారత మార్కెట్లో రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక‌ అదే అప్డేట్ కి సంబంధించి.. వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ స్పెషల్ ఎడిషన్ అయిన మార్బుల్ ఓడిస్సి ఎడిషన్ ను జూన్ 6న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది కంపెనీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement