Sunday, May 5, 2024

వింత శుభలేఖ… మా అదృశ్య పుత్రుడు వరుడు చిరంజీవి కరోనాకు పెళ్లి

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల మీమ్స్, ఫన్నీ పోస్ట్ లుపుట్టుకొస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పై రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. అయితే అందులో ఇప్పుడు ఓ శుభలేఖ వైరల్ అవుతుంది. కరోనా వారి పెండ్లి పిలుపు… మా అదృశ్య పుత్రుడు వరుడు చిరంజీవి కరోనాకు చైనా వాస్తవ్యులు వధువు చి.ల.సౌ మిగిలిన దేశాల ప్రజలు లకు వివాహ మహోత్సవం జరుపుటకు కాలము నిర్ణయించబడినది. కళ్యాణ వేదిక క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డులో గల హాస్పిటల్స్ నందు జరుగును.

ఆహ్వానించువారు చైనా దేశ ప్రజలు అంటూ ఓ పోస్టు వైరల్ గా మారింది. ఆకరిలో విన్నపము అంటూ… మూతికి గుడ్డ కట్టి, శానిటైజర్ చేతబట్టి, కళ్యాణ వేదిక నందు సామాజిక దూరం పాటిస్తూ తమ చేతులతో కరోనాను ఆశీర్వదించగలరు అంటూ చెప్పుకొచ్చారు. ఇక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement