Sunday, May 5, 2024

యూపీ, గుజరాత్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్…

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ బయట పెట్టిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతుచూస్తామని నలుగురు తెరాస ఎమ్మెల్యేలకు యూపీ, గుజరాత్ నుంచి కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ హై కమాండ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ల భద్రతను పోలీసులు సమీక్షించారు. మరింత భద్రత కల్పించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement