Monday, May 6, 2024

Formula-E race: నేడే తుది రేసింగ్‌.. ఫార్ములా ఈ-రేస్ వద్ద సెలబ్రిటీల సందడి..

ఈ ఫార్ములా రేసర్లు ఫైనల్‌ రేస్‌కి రెడీ అవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మెయిన్‌ రేసింగ్‌ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ రేసుకు భారీ ఏర్పాట్లు కూడా చేశారు నిర్వహకులు. ఒకేసారి 21 వేల మంది చూసేందుకు తగిన సదుపాయాలను కల్పించారు. 2.8 కిలోమీటర్ల సర్క్యూట్‌పై మొత్తం 11 జట్ల కింద.. 22 మంది రేసర్లు ఇవాళ రేసులో పాల్గొంటారు. గంటకు 322 కి.మీ వాయువేగంతో కార్లు దూసుకుపోనున్నాయి. అసలుసిసలైన ఫార్ములా అనుభూతిని చూపించనున్న రేసర్లు. ఈ రేసులో విదేశీ కంపెనీలు, రేసర్లతోపాటూ.. భారత్‌ నుంచి పోటీలో మహీంద్ర రేసింగ్‌, టీసీఎస్‌ జాగ్వార్‌లు నిలవనున్నాయి. కాగా సాయంత్రం 45 నిమిషాల పాటు మెయిన్ రేస్ నిర్వహిస్తారు. ఈ సమయంలో 18 మలుపులతో ఉన్న హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో 32 ల్యాప్స్‌ జరుగుతాయి. 45 నిమిషాల తర్వాత విన్నర్‌ను తేల్చేందుకు మరో ల్యాప్‌ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన వారు రౌండ్‌ 4 విన్నర్‌ అవుతాడు. అతనికి 25 పాయింట్లు దక్కుతాయి. తొలి పది స్థానాల్లో నిలిచిన వారికే పాయింట్లు లభిస్తాయి.

ఫార్ములా ఈ రేసింగ్కు వచ్చిన క్రికెటర్లు
ఇండియాలో రేసింగ్‌ ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఈ రేసింగ్ క్వాలిఫైంగ్ రౌండ్ జరిగింది. క్వాలిఫైంగ్ రౌండ్ ద్వారా పోల్ పోజిషన్ నిర్ణయిస్తారు. ఈ ఈవెంట్లో పలువురు క్రికెటర్లు సందడి చేశారు. సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, చాహల్, దీపక్ చాహర్ రేసింగ్ చూడడానికి వచ్చారు. వారిని చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సచిన్ రామ్ చరణ్ ను కలిశారు. ప్రస్తుతం సచిన్, రామ్ చరణ్ ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోటీలను చూసేందుకు మహేష్‌ బాబు కుమారుడు గౌతమ్ తదితరులు ఇచ్చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement