Friday, April 26, 2024

బ‌తికి ఉన్నంత కాలం చంద్ర‌బాబుతోనే ఉంటా- మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌

తాను బ‌తికి ఉన్నంత కాలం టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడుతోనే ఉంటాన‌ని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న స్ప‌ష్టం చేశారు.ఆయ‌న టీడీపీని వీడబోతున్నానంటూ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. బుద్ధా వెంకన్న టీడీపీని వీడబోతున్నారన్న వార్తల వెనక ఓ కారణం కూడా ఉంది. విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా వెంకన్న ఫొటో లేకపోవడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. వేదికపైకి వెళ్లొద్దని ఆయనను వారించారు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి బయటకు వచ్చారు. అంతే.. ఆయన టీడీపీని వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ ప్రచారంపై స్పందించిన వెంకన్న.. వాటిని ఖండించారు. అలాంటి ఆలోచనేదీ తనకు లేదని, కొందరు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement