Saturday, April 27, 2024

ఇంటి నుంచి పారిపోయిన ఫారెనర్​​.. తల్లిదండ్రుల చెంతకు చేర్చిన తమిళనాడు పోలీసులు

మథుర నుంచి పారిపోయిన ఓ ఫారినర్​ని తమిళనాడులోని కన్యాకుమారిలో పోలీసులు గుర్తించారు. అతనిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చి మానవత్వం చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 13 ఏళ్ల విదేశీ పౌరుడు ఇంటి నుంచి పారిపోయాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు వాసుదేవ, అలెగ్జాండ్రా జర్వినన్ ఆధ్యాత్మిక కారణాల వల్ల మధురలో స్థిరపడ్డారు. 13 ఏళ్ల బాలుడిని కూడా పట్టణంలోని దేవాలయ పాఠశాలలో వారు చేర్పించారు. అయితే కొద్దిరోజుల క్రితం వారు తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వారికి రిలీఫ్​ కలిగించేలా తమిళనాడు పోలీసుల నుండి ఓ ఫోన్​ కాల్​ వచ్చింది.

ఇంటి నుండి పారిపోయిన తర్వాత ఆ బాలుడు కేరళలోని తిరువనంతపురంలో రైలు ఎక్కాడు. రెండు రోజుల పాటు తమిళనాడులోని కన్యాకుమారి వీధుల్లో తిరుగుతున్న అతడిని పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. చివరకు పోలీసులు బాలుడితో మాట్లాడినప్పుడు అతను ఇంగ్లిష్, రష్యన్ భాషలలో మాట్లాడటం విని వారు ఆశ్చర్యపోయారు. బాలుడిని విచారించగా తాను ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్టు వెల్లడించాడు. మధుర పోలీసులతో క్రాస్ చెకింగ్‌లో బాలుడి తల్లిదండ్రులు పిర్యాదు  చేసినట్టుగా తేలింది. దీంతో తమిళనాడు పోలీసులు బాలుడి తల్లిదండ్రులను పిలిపించి పారిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హరికిరణ్ ప్రసాద్ బాలుడికి కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులతో ఇంటికి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement