Thursday, May 2, 2024

రైల్వేలో వాట్సాప్‌లో ఫుడ్‌ ఆర్డర్‌

రైళ్లలో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రయాణంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. ఇక నుంచి ప్రయాణికులు వాట్సాప్‌ ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఈ-కేటరింగ్‌ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా ఎంపిక చేసిన రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్‌ యాప్‌ ద్వారాఈ సదుపాయాన్ని అందిస్తోంది. వాట్సాప్‌లో ఈ సేవలు పొందేందుకు 8750001323 అనే నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇక నుంచి టికెట్‌ బుక్‌ చేసుకున్న తరువాత ఈ వాట్సాప్‌ నంబర్‌ నుంచి ఈ-కేటరింగ్‌ సర్వీస్‌ సేవలకు సంబంధించి వెబ్‌సైట్‌ లింగ్‌ వస్తుంది. అందుబాటులో ఉన్న స్టేషన్లలో తమకు నచ్చిన రెస్టారెంట్‌ నుంచి ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఆ తరువాత నుంచి ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ ఈ కేటరింగ్‌కు సంబంధించిన సేవలను నేరుగా అందించనుంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ ద్వారా రోజుకు ఐఆర్‌సీటీసీ 50 వలే మీల్స్‌ను ప్రయాణీకులకు అందిస్తోంది.

- Advertisement -

ప్రస్తుతానికి ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా మిగిలిన రైళ్లలోనూ అమల్లోకి తీసుకు వస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఇప్పటికే జాప్‌ అనే థర్డ్‌ పార్టీ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం గత సంవత్సరం వాట్సాప్‌ చాట్‌బోట్‌ ద్వారా రైళ్లలో ఆహారాన్ని అందించే సేవలు ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement