Tuesday, April 30, 2024

Dense fog: ఢిల్లీని క‌ప్పేసిన పొగ‌మంచు…జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ

ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీతో సహా పలు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ ఢిల్లీలో జీరో స్థాయికి విజిబులిటీ పడిపోయింది. విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

డిసెంబర్ నెలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. శీతాకాలం పూర్తి స్వింగ్లో ఉంది. రాజధాని ఢిల్లీలో చలి విపరీతంగా ఉంది. ఉదయం, రాత్రి దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. దాని కారణంగా రోడ్లపై నడవడమే కష్టంగా మారే పరిస్థితి నెలకొంది. గతంలో వాహనాలు రోడ్డుపై స్పీడ్‌గా నడిచేవి ఇప్పుడు నెమ్మదించాయి. విజిబిలిటీ తక్కువగా ఉండడంతో వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. బుధవారం ఈ సీజన్లో మొదటిసారిగా అనేక ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ కనిపించింది. దట్టమైన పొగమంచు ట్రాఫిక్పై ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

దీంతో రైళ్ల రాకపోకలు, విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తుండగా, పలు విమానాల మార్గాలు దారి మళ్లించబడ్డాయి. శీతాకాలం దృష్ట్యా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ ఒకరోజు ముందుగానే అంచనా వేసింది. పొగమంచు కారణంగా ఢిల్లీ మొత్తం తెల్లటి పొగమంచుతో క‌ప్పేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement