Friday, May 3, 2024

Fire: అత్తాపూర్‌లో అగ్నిప్ర‌మాదం… భారీగా ఆస్తిన‌ష్టం…

హైదరాబాద్​ తరుచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. బుధవారం తెల్లవారు జామున అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో సులేమాన్‌నగర్ ఎంఎం పహాడీలోని ఓ కట్టెల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణానికీ అంటుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలకుతోడు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. మరోవైపు, స్థానికులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా జరిగిందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement