Sunday, April 28, 2024

23నుంచి ప్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ : స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల‌పై డిస్కౌంట్స్..

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ ఈనెల 23న బిగ్ సేవింగ్స్ డే సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్‌లో భాగంగా క‌స్ట‌మ‌ర్ల‌కు స్మార్ట్‌ఫోన్లు, హెడ్ సెట్స్, ల్యాప్‌టాప్‌లు స‌హా ప‌లు ఎలక్ట్రానిక్స్‌పై ఆక‌ర్ష‌ణీయ డీల్స్‌, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. జులై 27 వ‌ర‌కూ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫ‌ర్లు లైవ్‌లో ఉండ‌నుంది. ఒప్పో రెనో 5 ప్రొ, ఐఫోన్ 11, మోటో జీ31పై ప‌లు ఆఫ‌ర్ల గురంచి ఫ్లిప్‌కార్ట్ ఇప్ప‌టికే టీజ‌ర్ల‌లో వెల్ల‌డించింది. సేల్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డే కొద్దీ మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

ఎల‌క్ట్రానిక్స్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 80 శాతం వ‌ర‌కూ డిస్కౌంట్లు ఉన్నాయి. బ్యాంక్ కార్డ్‌లు మరియు EMI లావాదేవీలపై కూడా డిస్కౌంట్‌లు ఉండవచ్చు. ఇక హెడ్‌పోన్లు, స్పీక‌ర్ల‌పై 70 శాతం వ‌ర‌కూ డిస్కౌంట్ ల‌భించ‌నుండ‌గా రూ.99 నుంచి రూట‌ర్స్‌, కీబోర్డులు వంటి కంప్యూట‌ర్ యాక్సెస‌రీస్ ల‌భిస్తాయి. ఇక ట్యాబ్లెట్స్‌పై సేల్‌లో 45 శాతం వ‌ర‌కూ డిస్కౌంట్ ఆఫ‌ర్ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ కూడా 12pm మరియు 10pm మధ్య తక్కువ ధరలో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

సేల్‌లో టీవీలు, అప్ల‌య‌న్సెస్‌పై ఏకంగా 70 శాతం ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. బ్యాంక్ ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్లు అద‌నంగా డిస్కౌంట్లు పొందే వెసులుబాటు ఉంది. కొన్ని ఉత్ప‌త్తుల‌పై నోకాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ అందుబాటులో ఉంది. ఇక మ‌రో ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ సైతం జులై 23న ప్రైం డే సేల్‌ను నిర్వ‌హిస్తోంది. జులై 24న అమెజాన్ సేల్ ముగియ‌నుండ‌గా కొన్ని ఆఫ‌ర్ల‌ను జులై 27 వ‌ర‌కూ కంపెనీ పొడిగించే అవ‌కాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement