Monday, May 6, 2024

జ‌మ్ములో ఉగ్ర దాడి – అయిదుగురు జ‌వాన్లు మ‌ర‌ణం…

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదుల బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు మృతి చెందారు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు. ఇటీవల పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేల్చిన తర్వాత కాండి ఫారెస్ట్ లోని ఓ గుహలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు. ఈ పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉధంపుర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే దాక్కొని ఉండ‌టంతో ఆర్మీ త‌న ఆప‌రేష‌న్ ను కొన‌సాగిస్తున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement