Sunday, May 5, 2024

First Test – నేటి నుంచి విండీస్ తో టీమ్ ఇండియా తొలి టెస్ట్

డొమినికా: . వెస్టిండీస్‌ టూర్‌లో భాగంగా నేటి నుంచి భారత్‌ తొలి టెస్టు ఆడనుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేయనుండగా.. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే చతేశ్వర్‌ పుజారాపై వేటు పడటంతో అతడి స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ తొలి సారి టెస్టు జట్టుకు ఎంపిక కాగా.. వీరిలో యశస్వికి తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువ.

నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లీ, ఆ తర్వాత అజింక్యా రహానే బ్యాటింగ్‌కు రానున్నారు. వికెట్‌ కీపర్‌గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్‌ భరత్‌తో ఇషాన్‌ కిషన్‌ పోటీపడుతున్నాడు. . రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండర్ల కోటాలో చోటు దక్కించుకోనుండగా.. ప్రధాన పేసర్‌ హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజ్‌తో పాటు కొత్త బంతిని పంచుకునేది ఎవరో తేలాల్సి ఉంది. నవ్‌దీప్‌ సైనీ, జైదేవ్‌ ఉనాద్కట్‌, ముఖేశ్‌ కుమార్‌.. ఈ ప్లేస్‌ కోసం పోటీపడుతుండగా.. వీరిలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ముఖేశ్‌ వైపు మొగ్గుచూపేలా ఉంది. మరోవైపు తొలి టెస్టు కోసం వెస్టిండీస్‌ 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఎక్కువ శాతం కొత్త ప్లేయర్లకు అవకాశం దక్కింది

Advertisement

తాజా వార్తలు

Advertisement