Thursday, May 16, 2024

‘ద‌స‌రా’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్.. ‘ధూమ్ ధామ్ ధోస్థాన్’తో దుమ్ము లేపిన నాని

నాని ద‌స‌రా సినిమా నుంచి కొత్త అప్‌డేట్ వ‌చ్చేసింది. కెరీర్ తొలిసారి పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో నాని న‌టిస్తున్న సినిమా ఇది. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ధ‌స‌రా సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ ధూమ్ దామ్ దోస్తాన్‌ను ఈ రోజు (అక్టోబ‌ర్ 3)న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన విశ‌యం తెలిసిందే.. కాగా కొద్ది సేప‌టి క్రితం 4:23 సాగే ధూమ్ ధామ్ ధోస్థాన్ పాట లిరిక‌ల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఇందులో ఫుల్ మాస్ అవ‌తారంలో నాని క‌నిపిస్తున్నాడు. లుంగీ ధ‌రించి దుమ్ముతో నిండిపోయి అత‌డు క‌నిపించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కోల్ మైన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాట‌లో నాని డ్యాన్సులు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ఉంది.

ద‌స‌రా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నేను లోక‌ల్ త‌ర్వాత నాని, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది. అంతేకాకుండా నాని న‌టిస్తున్న తొలి పాన్ ఇండియ‌న్ సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా 2023 మార్చి 30 రిలీజ్ చేయ‌బోతున్నారు. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

- Advertisement -
YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement