Tuesday, May 21, 2024

రేప‌టితో ముగియనున్న గేట్‌ రిజిస్ట్రేషన్‌ గడువు.. లేట్ ఫీజు లేకుండా చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌-2023)కి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రేపు ఆఖరు తేదీ. గడువు గత నెల 30వ తేదీతోనే ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి అందిన వినతుల మేరకు రిజిస్ట్రేషన్‌ గడువును ఈనెల 4వరకు పెంచారు. దీంతో రేపటితో గేట్‌ రిజిస్ట్రేషన్‌కు గడువు ముగియనుంది. ఈనెల 4వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకుండా దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. గేట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంజనీరింగ్‌ లేదా సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement