Monday, April 29, 2024

నూమాయిష్‌లో అటవీశాఖకు ఫస్ట్‌ ప్రైజ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గత 8ఏళ్లుగా హరితహారం ద్వారా అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న పథకాలు, వాటి ప్రదర్శనకుగానూ నుమాయిష్‌లో మొదటి బహుమతిని అటవీశాఖ దక్కించుకుంది. ఎగ్జిబిషన్‌-2023 ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్‌ అలీ చేతులమీదుగా అటవీశాఖ అధికారులు ఈ బహుమతిని అందుకున్నారు. ప్రభుత్వ శాఖలు, పథకాల అమలు ప్రదర్శన, మంచి అలంకరణ విభాగంలో తెలంగాణ అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌కు ఈ బహుమతి దక్కింది.

ప్రతీఏటా జరిగే ఎగ్జిబిషన్‌లో తెలంగాణ అటవీశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రదర్శన, మినీ జూతో కూడిన స్టాల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈసారి అడవి, వన్యప్రాణుల థీమ్‌తో ఆకర్షణీయంగా స్టాల్‌ను తీర్చిదిద్దడంతో అందరినీ ఆకట్టుకుంది. మొదటి బహుమతిని గెలుచుకోవడంతో అధికారులకు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్‌.ఎం.డోబ్రియాల్‌, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్‌ ఈమేరకు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement