Sunday, April 28, 2024

National : నోయిడాలో అగ్ని ప్ర‌మాదం…భయాందోళ‌న‌లో ప్ర‌జ‌లు…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గురువారం ఉద‌యం అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. గ్రేట్ నోయిడా వెస్ట్‌లోని గౌర్‌ సిటీ 16 అవెన్యూలోని రెండు ఫ్లాట్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది.

- Advertisement -

ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకొన్న ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement