Saturday, May 4, 2024

UPSC కార్యాలయంలో అగ్నిప్రమాదం

ఢిల్లీలోని షాజ‌హాన్ రోడ్‌లో ఉన్న యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) కార్యాల‌యంలో ఈరోజు సాయంత్రం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కార్యాల‌యంలోని నాలుగో అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన యూపీఎస్సీ సిబ్బంది అగ్నిమాప‌క శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న ఐదు ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపు చేశాయి. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement