Saturday, April 27, 2024

ఎఫ్‌ఐబీఏ ఆసియా కప్‌, భారత్‌ ఓటమి.. 63-104తేడాతో లెబనాన్‌ విజయం

ఎఫ్‌ఐబీఏ ఆసియా కప్‌లో భారత్‌ బాస్కెట్‌బాల్‌ టీం పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి వైదొలగింది. ఆదివారంనాడిక్కడ జరిగిన ఫైనల్‌ గ్రూప్‌-డీ మ్యాచ్‌లో లెబనాన్‌ చేతిలో 63-104తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. దీంతో గ్రూప్‌-డీలో భారత్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటికే టీమిండియా 47-100 తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో, 59-101 తేడాతో ఫిలిప్పీన్‌ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే… వరల్డ్‌ నం.54 లెబనాన్‌ ఆరంభంలో తడబడింది. తొలి 4 నిముషాల్లో 84వ ర్యాంక్డ్‌ భారత్‌ జట్టు 18-4తో ఆధిపత్యం చెలాయించినా, తర్వాత అదే ఊపు కొనసాగించలేకపోయింది.

దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి లెబనాన్‌ 57-23తేడాతో లీడ్‌ సాధించింది. ఆ తర్వాత కూడా టీమిండియా వరుస తప్పిదాలతో మ్యాచ్‌ను 104-63తో చేజార్చుకుంది. భారత తరఫున ఎం.బీ. హఫీజ్‌, ప్రత్యాన్షు తోమర్‌ టాప్‌ చెరో 11 పాయింట్లతో స్కోరర్స్‌ నిలిచారు. అమృత్‌పాల్‌ సింగ్‌ 10 పాయింట్లుతో ఆ తర్వాత స్థానంలో నిలిచాడు. లెబనాన్‌ జట్టులో యూసెఫ్‌ ఖయత్‌ 15 పాయింట్లు, జొనాథన్‌ అల్‌రెడ్జి 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. 1975 ఎఫ్‌ఐబీఏ ఆసియా కప్‌ టోర్నీలో మాత్రమే భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి, నాల్గో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement