Wednesday, May 15, 2024

FESTIVAL : సంక్రాంతి నాడు ఏం చేస్తారు..

రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు-, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తదుస్తులు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పిత్రుదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించడం. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి రమణీయంగా ఉంటాయి.

ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లు-గా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు- మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు-, అమ్మగారికి దండం పెట్టు- అంటూ గంగిరెద్దుల వాళ్లు సందడి చేస్తారు.కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో కొందరు వారికి ధాన్యం కూడాఇస్తారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి ప-్టట-లతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమంటుంటే చిందులు తొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.. అతడి కీర్తనలు వినసొంపుగా ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement