Thursday, May 2, 2024

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పెంపు..

న్యూఢిల్లి : దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా వడ్డీ రేట్లను సవరించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు పెంచిన తరువాత బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లలో మార్పులు చేయడం ప్రారంభించాయి. అదే బాటలో రెండు వారాల తరువాత దిగ్గజ బ్యాంక్‌ తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 9 నెలలకు పైగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎఫ్‌డీల కోసం కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. కొత్త హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎఫ్‌డీ వడ్డీ రేటు పెంపు డిపాజిట్‌ కాలాన్ని బట్టి 10 నుంచి 20 బేసిస్‌ పాయింట్ల వరకు మార్పు చేసింది. సీనియర్‌ సిటిజన్‌లు మాత్రం అదనంగా 0.50 శాతం రిటర్న్స్ పొందుతారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేటు పెంపు బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. రూ.2కోట్ల తక్కువ డిపాజిట్‌లకు తాజా వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్‌ పేర్కొంది.

ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లు పరిశీలిస్తే..

ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. 15-29 రోజులకు 2.50 శాతం, సీనియర్‌ సిటిజన్‌కు 3.00 శాతం, 30-45 రోజులకు, 46-60 రోజులకు అదేవిధంగా 61-90 రోజులకు 3.00 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 3.50 శాతం పెంచారు. 91-120 రోజులకు 3.50 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 4.00 శాతం, 6 నెలల నుంచి 9 నెలల వరకు 4.40 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 4.90 శాతం, 9 నెలల నుంచి ఒక సంత్సరం వరకు 4.45 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 5.00 శాతం పెంచారు. ఏడాది కాలంతో పాటు ఏడాది నుంచి రెండేళ్ల వరకు 5.10 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 5.60 శాతం పెంచారు. 2-3 ఏళ్ల వరకు 5.40 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 5.90 శాతం, 3-5 ఏళ్ల వరకు 5.60 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 6.10 శాతం, 5-10 ఏళ్ల వరకు 5.75 శాతం, సీనియర్‌ సిటిజన్‌కు 6.50 శాతంగా నిర్ణయించారు. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు తరువాత.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌తో పాటు ఇతర బ్యాంకులు ఇప్పటికే ఎఫ్‌డీ రేట్లను పెంచాయి. తాజాగా హెచ్డిdఎఫ్‌సీ కూడా తన ఎఫ్‌డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement