Sunday, April 28, 2024

రెండు రోజుల లాభాలకు బ్రేక్‌.. స్వల్ప నష్టాల్లో సూచీలు..

ముంబై : దేశీయ సూచీలు రెండు రోజుల వరుస లాభాల తరువాత బుధవారం నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడి కారణంగా మధ్యాహ్నానానికి నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 54,554.89 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,786.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,130.89 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 109.94 పాయిట్లు నష్టపోయి 54,208.53 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఉదయం 16,318.15 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16,399.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,211.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 19 పాయింట్లు నష్టపోయి 16,240.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే.. మార్కెట్లు ముగిసే సమయానికి రూపాయి మారకం విలువ రూ.77.58 వద్ద ట్రేడ్‌ అవుతున్నది.

వెంటాడుతున్న ద్రవ్యోల్బణం..

సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్‌ గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎస్బీఐ, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం నాటి భారీ లాభాలను ఇన్వెస్టర్లు క్యాష్‌ చేసుకున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వంటి పరిణామాల్లో ఎలాంటి సానుకూల అంశాలు లేనప్పటికీ.. సూచీలు రాణించాయి. ఏప్రిల్‌ టోకు ద్రవ్యోల్బణం 15.8 శాతానికి చేరడం కూడా సూచీలపై కొంత ప్రభావం చూపింది. ఫెడ్‌ వడ్డీ రేట్లను అవసరమైతే.. మరింత వేగంగా పెంచుతామనే పావెల్‌ ప్రకటన కూడా సూచీలను కలవరపర్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement