Tuesday, May 7, 2024

రైతుల అభివృద్ధే లక్ష్యం : నరేంద్ర మోడీ..

రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 10వ విడత నిధులను ప్రధాని మోడీ శనివారం విడుదల చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని మోడీ నిధులను విడుదల చేశారు. పలువురు లబ్దిదారులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ పథకం ఫండ్‌ నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.1.6 లక్షల కోట్లకు పైగా సమ్మాన్‌ నిధులను రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా.. దేశ వ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమ అయ్యాయి.

ప్రణాళిలకలకు అనుగుణంగా..

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఎగుమతుల్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. అందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8 శాతానికి పైగా ఉందని.. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు భారత్‌కు వస్తున్నాయన్నారు. 2021లో కేవలం యూపీఐ ద్వారానే.. రూ.70కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. పట్టాదారు పాస్‌ బుక్‌ ఉన్న రైతులకు ఏడాదికి ఆరువేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందన్నారు. ఇది ఏడాదిలో మూడు విడతలుగా రైతుల బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతాయని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పటి వరకు 9సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందజేసిందని వివరించారు. పీఎం కిసాన్‌ నిధులతో పాటు 351 వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్‌పీఓ)లకు రూ.14కోట్లు విడుదల చేశారు.

దీని ద్వారా 1.24లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. దేశంలో సుమారు 50వేలకు పైగా స్టార్టప్‌లు ఆవిర్భవించినట్టు తెలిపారు. గత 6 నెలల్లో 10వేలకు పైగా స్టార్టప్‌లు ఏర్పడ్డాయని, 2022లో వీటిని వేగవంతం చేయాలని తెలిపారు. గత ఆరు నెలల్లో 10వేలకు పైగా స్టార్టప్‌లు కొనసాగిస్తున్నామని, 2070 నాటికి కార్బన్‌ ఉద్గారాల విడుదల జీరోకు తీసుకురానున్నట్టు వివరించారు. హైడ్రోజన్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రత్యేకంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టినట్టు ప్రధాని వివరించారు. అబ్బాయిలతో సమానంగా యువతుల వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచినట్టు తెలిపారు. గతి శక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌తో మౌలిక సదుపాయాలను పెంచనున్నట్టు వివరించారు.

9 రాష్ట్రాల సీఎంలు హాజరు..

- Advertisement -

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 9 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, వ్యవసాయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ.. 2022 నూతన సంవత్సరం మొదటి రోజున దాదాపు 10.9 కోట్ల మంది లబ్దిదారులకు రూ.20,900 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. రైతులకు లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశంతో పీఎం కిసాన్‌ అమలు చేస్తున్నట్టు తెలిపారు. 9వ విడత పీఎం కిసాన్‌ నిధులు గడిచిన ఆగస్టు నెలలో విడుదల చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement