Thursday, May 9, 2024

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

స‌మ‌స్యల ప‌రిష్కారం కోరుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేత‌లు, ప‌లు సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్ట‌డి ఉద్రిక్తతకు దారి తీసింది.  నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప‌లువురు అసెంబ్లీ ముట్ట‌డికి య‌త్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని రైతులు పట్టుపట్టారు. గత ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలంటూ కాంగ్రెస్ నేత‌ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ ముట్ట‌డికి య‌త్నించ‌గా వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్ట‌డికి య‌త్నించింది. ఎస్సీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement